పెటాపై కూడా ప్ర‌శంస‌లు కురిపించిన మ‌హేష్ బాబు

వాస్తవం సినిమా: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు త‌న‌కు న‌చ్చిన సినిమాలపై ట్విట‌ర్ ద్వారా ప్ర‌శంస‌లు కురిపిస్తుంటాడు. ఇటీవ‌ల ఎన్టీయార్‌ సినిమాను ట్విట‌ర్ ద్వారా మ‌హేష్ అభినందించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన పెటాపై కూడా ప్ర‌శంస‌లు కురిపించాడు. పెటాతో ర‌జినీ అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చార‌ని కొనియాడాడు.

నాలాంటి రజినీకాంత్‌ అభిమానులందరికీ పెటాతో మంచి ట్రీట్ ఇచ్చారు. త‌లైవాకు వంద‌నాలు. మ‌న‌కున్న అద్భుత‌మైన టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌లో కార్తీక్ సుబ్బ‌రాజ్ ఒక‌రు. ఎప్ప‌టిలాగే సినిమాటోగ్రాఫ‌ర్ తిరు అద్భుతంగా ప‌నిచేశారు. ఈ చిత్రం కోసం ప‌నిచేసిన అంద‌రికీ అభినంద‌న‌లు అని మ‌హేష్ ట్వీట్ చేశాడు.