కుంభమేళా నేపథ్యంలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలకు భారీ జరిమానాలు

వాస్తవం ప్రతినిధి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో పవిత్ర గంగా నదిలోకి కాలుష్యాన్ని వెదజల్లుతున్న పశువధశాల, బీరు ఫ్యాక్టరీలకు యూపీ సర్కారు సీలు వేసింది. గంగా నదిలోకి కలుషిత జలాలు రాకుండా నిరోధించేందుకు యూపీ కాలుష్యనియంత్రణ మండలి అధికారులు అలీఘడ్ నగరంలోని హింద్ ఆగ్రో ఇండస్ట్రిస్ లిమిటెడ్, వేవ్ డిస్ట్రిలరీ, బ్రేవరీస్ లిమిటెడ్ ఫ్యాక్టరీలను మూసివేయించారు. కాలుష్యనియంత్రణ సంస్థ అధికారులు కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలకు నోటీసులు జారీ చేసి వాటిని మూసివేశారు. ఈ నెల 15 నుంచి మార్చి 4వతేదీ వరకు కుంభమేళా జరుగుతున్న దృష్ట్యా అలీఘడ్ పశువధశాలను బంద్ చేయించారు. కుంభమేళా సందర్భంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలకు భారీ జరిమానాలు విధిస్తామని యూపీ సర్కారు హెచ్చరించింది.