14 నెలల తర్వాత సొంత జిల్లా కడపకు చేరుకున్న జగన్

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ దాదాపు 14 నెలల తర్వాత సొంత జిల్లా కడపకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడి సీఎస్ఐ చర్చిలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు పులివెందులలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి ఇడుపులపాయకు చేరుకుని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు అర్పించనున్నారు.