వారి పొత్తు మాకే లాభం: యోగి

వాస్తవం ప్రతినిధి: రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కుదుర్చుకున్న పొత్తుపై ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ తమ ఉనికి కోసమే ఏకమయ్యాయని, ప్రజలకు ఈ పార్టీల గురించి బాగా తెలుసునని, తగిన విధంగా ఓట్లు వేస్తారంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘తమ ఉనికిని కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం. అంతకన్నా మరేమీ లేదు. వారి పొత్తు మాకే(బీజేపీ) లాభాన్ని చేకూరుస్తుంది. ప్రజలకు తెలుసు అసలు నిజాలేమిటో, అందుకు అనుగుణంగా ఓట్లు వేస్తారు అని యోగి వ్యాఖ్యానించారు. బీజేపీ 2014లో సాధించిన స్థానాలక కన్నా ఎక్కువ స్థానాలను 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తుందిఅని ధీమా వ్యక్తం చేశారు.