పార్టీ మారే ప్రసక్తే లేదు: అఖిలప్రియ

వాస్తవం ప్రతినిధి: జనసేన లేదా వైసీపీలో జాయిన్ అవుతానంటూ తనపై వచ్చిన పుకార్లను ఖండించారు అఖిలప్రియ. అలాంటిదేం లేదని ఇన్నాళ్లూ తనపై వచ్చిన వార్తలు అవాస్తవాలని కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా మరోసారి గెలిచి తన గెలుపును చంద్రబాబుకు కానుకగా ఇస్తానంటున్నారు అఖిల. తమ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చిన చంద్రబాబును కాదని మరో పార్టీలోకి వెళ్లే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.

ఇంత సడెన్ గా అఖిల ప్లేటు ఫిరాయించడంతో అవాక్కవ్వడం విశ్లేషకుల వంతు అయింది. రాత్రికి రాత్రి అధిష్టానం నుంచి ఆమెకు బలమైన హామీ అయినా లభించి ఉండాలి లేదంటే గట్టిగా బ్రెయిన్ వాష్ అయినా జరిగి ఉండాలి. రెండోదే జరిగి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.