బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు…15 మందికి తీవ్ర గాయాలు

వాస్తవం ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట్ మండలం నాగిరెడ్డిపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వికారాబాద్ డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించడం తో అక్కడకి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.