సిఎం కూర్చోవడానికి కుర్చీ కూడా లేకుండా రాష్ట్ర విభజన చేశారు: లోకేశ్

వాస్తవం ప్రతినిధి: సి ఎం కూర్చోవడానికి కుర్చీ కూడా లేకుండా రాష్ట్ర విభజన చేశారు అని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం జన్మభూమి సభలో మాట్లాడిన మంత్రి లోకేష్ అనాధగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. కనీసం మన ముఖ్యమంత్రి కూర్చోడానికి కూడా కుర్చీలేని స్థితి ఇచ్చారని..అయినా ఎక్కడా మనం రాజీపడకుండా ముందుకు వెళ్తున్నామని అన్నారు. అంతేకాకుండా 20 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్యానిదేనని, 200 రూపాయల పింఛన్ 2 వేల రూపాయలు చేశామని రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్ట పడుతుంటే…. ప్రోత్సహించాల్సింది పోయి మోదీ ఇబ్బంది పెడుతున్నారంటూ లోకేశ్ ఆరోపించారు . ప్రతిపక్ష నాయకుడు మోదీ ని ప్రశ్నించాల్సింది పోయి చంద్రబాబునే విమర్శిస్తున్నార‌ని మండిప‌డ్డారు. మొన్న కర్ణాటకలో చూపించింది కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఏపీలో ముందుందన్న లోకేష్… రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మళ్ళీ మన చంద్ర‌బాబే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు.