దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌక

వాస్తవం ప్రతినిధి: ద‌క్షిణ చైనా స‌ముద్రం ఇప్పుడు ఉద్రిక్త ప్రాంతంగా మారింది. ప్ర‌స్తుతం అక్క‌డి జ‌లాల్లో అమెరికాకు చెందిన మెక్ క్యాంప్‌బెల్ క్షిప‌ణి విధ్వంస‌క నౌక ఒకటి ప‌హారా కాస్తోంది. జీషా దీవుల్లో ఆ నౌక సంచ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అమెరికా నౌక సంచారంతో.. చైనా అప్ర‌మ‌త్త‌మై, త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఇంట‌ర్మీడియ‌ట్ రేంజ్ అణు సామ‌ర్థ్యం క‌లిగిన డీఎఫ్‌-26 క్షిప‌ణి విధ్వంస‌క నౌక‌ను మోహ‌రిస్తోంది. ఫ్రీడ‌మ్ ఆఫ్ నావిగేష‌న్ అన్న సంకేతంతో త‌మ నౌక సంచ‌రిస్తున్న‌ట్లు అమెరికా వెల్ల‌డిస్తోంది. కానీ అమెరికా వాద‌న‌ల‌ను చైనా కొట్టిపారేస్తోంది. త‌మ జ‌లాల్లోకి అమెరికా నౌక‌లు అక్ర‌మంగా ప్ర‌వేశిస్తున్న‌ట్లు చైనా ఆరోపిస్తున్న‌ది.