యూరోప్ లో తీవ్రంగా కురుస్తున్న మంచు….స్తంబించిన ట్రాఫిక్!

వాస్తవం ప్రతినిధి: విపరీత వాతావరణ పరిస్థితుల నేపద్యంలో యూరోప్ దేశాలు గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నాయి. అన్ని దేశాల్లోనూ ఇప్పుడు ఆర్కిటిక్ వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నట్లు తెలుస్తుంది. ఈ విప‌రీత వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ (బీస్ట్ ఫ్ర‌మ్ ద ఈస్ట్) కారణంగా చాలా వ‌ర‌కు యూరోప్ దేశాల్లో భారీ స్థాయిలో మంచు కురుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రియాలోని ఆల్ప్స్ ప‌ర్వ‌తాలు కూడా మంచుతో నిండిపోయాయి. అంతేకాకుండా అక్కడ తీవ్రమైన మంచు కురుస్తుండడం తో యూరోప్ స్తంభించినట్లు తెలుస్తుంది. దీనితో అక్క‌డ ఆర్మీ ప్ర‌త్యేకంగా స‌హాయ చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైంది. స్కూళ్ల‌ను మూసివేశారు. నార్వేలోనూ వింట‌ర్ స్టార్మ్స్ ద‌డ‌ద‌డ పుట్టిస్తున్నాయి. ఓ విమానాశ్ర‌యాన్ని మూసి వేసి ఫ్ల‌యిట్ల‌ను ర‌ద్దు చేశారు. సెర్బియా, గ్రీస్‌లోనూ శీతాకాల చ‌లులు చంపేస్తున్నాయి. మ‌రికొన్ని రోజుల పాటు వెద‌ర్ ఇలాగే ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.