షాకింగ్……బెజోస్ భరణం ఎంత చెల్లిస్తున్నాడు అంటే!

వాస్తవం ప్రతినిధి: పాతికేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ భార్య మెకాంజీ నుంచి విడాకులు తీసుకున్నానంటూ అమెజాన్‌ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ యాంకర్‌తో ప్రేమలో పడిన బెజోస్‌ తన భార్య నుంచి విడిపోతున్నారంటూ రూమర్లు ప్రచారం అవుతున్నాయి, ఈ నేపథ్యంలో.. ప్రపంచలోనే అత్యంత ధనవంతుడైన బెజోస్‌ ప్రస్తుత సంపాదన 137 బిలియన్‌ డాలర్లని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా భరణం రూపంలో ఆయన.. తన భార్యకు సుమారు 60-70 బిలియన్‌ డాలర్లు(రూ. 42,38,10,00,00,000- నాలుగున్నర లక్షల కోట్లు) చెల్లించనున్నారట. దీంతో బెజోస్‌ సంపద సగానికి తగ్గనుంది. ఈ క్రమంలో విడాకుల అనంతరం… ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా మెకాంజీ నిలవనున్నారట. పాతికేళ్లపాటు భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని బెజోస్‌ తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని సంయుక్త ప్రకనటలో తెలిపారు.