కాంగో అధ్యక్షుడిగా తొలిసారి ప్రతి పక్ష నేత

వాస్తవం ప్రతినిధి: కాంగో కొత్త అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేత ఫెలిక్స్‌ షికెడి విజయం సాధించినట్లు తెలుస్తుంది. అయితే ఫెలిక్స్‌ ఎన్నికను కుట్రగా రెండో స్థానంలో నిలిచిన మరో అభ్యర్థి మార్టిన్‌ ఫయలు ఆరోపిస్తున్నారు. 1960లో కాంగో స్వాతంత్య్రం సాధించిన తరువాత ప్రతిపక్ష అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే ప్రథమం. గత నెల 30న ఎన్నికలు నిర్వహించగా, ఫలితాలు గురువారం నాడు వెల్లడయ్యాయి. ఫెలిక్స్‌కు 70 లక్షల ఓట్లు ఎలా వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయని ఫయలు ప్రశ్నించారు. మరోపక్క కాంగోను వలస కాలనీగా చాలా కాలంపాటు తన గుప్పెట్లో పెట్టుకున్న బెల్జియం, ఫ్రాన్స్‌ ఈ ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఫెలిక్స్‌ మూడో స్థానంలో వున్న మాజీ అధ్యక్షుడు జోసెఫ్‌ కబీలాతో కలసి అధికారం పంచుకునేందుకు ఒప్పందానికి ప్రయత్నిస్తున్నారు.