జపాన్ ఉద్రిక్తతలను రెచ్చగొడుతుంది: రష్యా

వాస్తవం ప్రతినిధి: జపాన్ ఉద్రిక్తతలను రెచ్చగోడుతోంది అంటూ రష్యా ఆరోపిస్తుంది. నాలుగు వివాదాస్పద పసిఫిక్‌ దీవులకు సంబంధించి తమతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం విషయంలో జపాన్‌ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందంటూ రష్యా ఆరోపించింది. ఈ దీవులను తమకు బదిలీ చేసేందుకు వీలుగా అక్కడి ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అవసరం వుందని, అప్పుడే తాము రష్యా నుండి పరిహారం కోసం చేస్తున్న డిమాండ్‌ను వదులుకుంటామని జపాన్‌ చేసిన వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. మాస్కోలోని జపాన్‌ రాయబారి తొయోహిసా కొజుకిని బుధవారం పిలిపించి అధికారికంగా తమ నిరసన తెలియచేసింది. జపాన్‌ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు రష్యాతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాల స్ఫూర్తికి విరుద్ధమని, ఇవి ఇరుదేశాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రష్యా ప్రభుత్వం విమర్శించినట్లు తెలుస్తుంది.