అమెరికా, చైనా ల మధ్య ముగిసిన వాణిజ్య చర్చలు

వాస్తవం ప్రతినిధి: గత కొద్ది రోజులుగా అమెరికా, చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి పరస్పర ఆమోదయోగ్యమైన అంగీకారాన్ని కనుగొనేందుకు గత మూడు రోజులుగా చైనా, అమెరికా మధ్య చర్చలు జరుతున్నాయి. అయితే ఈ చర్చలు ముగిసినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లూ కాంగ్ పత్రికా సమావేశంలో ప్రకటించారు. అయితే ఒప్పందం కుదిరినదీ, లేనిదీ అన్న వివరాలను మాత్రం ఆయన చెప్పలేదు. బుధవారం వరకు చర్చలు జరిగాయంటే ఇరు పక్షాలు కూడా ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి నిబద్ధతతో వున్నాయని స్పష్టమవుతోందని లూకాంగ్‌ తెలిపారు. అంతకుముందు అమెరికా వాణిజ్య ప్రతినిధులు విలేకర్లతో మాట్లాడుతూ, చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని చెప్పారు.