ఏఎన్నార్ బయోపిక్ విషయంలో మనసు మార్చుకున్న నాగార్జున

వాస్తవం సినిమా: ఈమద్య కాలంలో వరుసగా తెలుగులో బయోపిక్ లు వచ్చాయి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆమద్య వార్తలు వచ్చాయి. బయోపిక్ వార్తలపై నాగార్జున పలు సార్లు స్పందిస్తూ ఆ ఆలోచన లేదని తేల్చి పారేశాడు. అయితే ఇప్పుడు ఏఎన్నార్ బయోపిక్ విషయంలో నాగార్జున మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. సినిమా తీశాక లాభనష్టాల సంగతి అటుంచితే, తరువాత తరాలవారికి ఏఎన్నార్ గురించిన జీవిత విశేషాలను అందిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. రీసెంట్ గా ఈ విషయమై నాగార్జున కుటుంబ సభ్యులంతా కూర్చుని ఒక నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ప్రశంసలు అందుకోవడంతో, బయోపిక్ అంటూ తీస్తే సుమంత్ తోనే తీయవచ్చనే టాక్ వినిపిస్తోంది.