సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్

వాస్తవం సినిమా: ‘రచ్చ’ .. ‘బెంగాల్ టైగర్’ వంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ ను దర్శకుడు సంపత్ నంది ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ఆయన గోపీచంద్ కథానాయకుడిగా ‘గౌతమ్ నంద’ సినిమాను తెరకెక్కించాడు. గోపీచంద్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, పరాజయాన్ని చవిచూసింది. అప్పటి నుంచి ఆయన కొత్త ప్రాజెక్టును సెట్ చేసుకునే పనిలోనే వున్నాడు. ఆ తరువాత గోపీచంద్ చేసిన సినిమాలు కూడా ఆయనని పూర్తిగా నిరాశపరిచాయి. ఇటీవలే ఆయనని సంపత్ నంది కలిసి ఒక కథ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో గోపీచంద్ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. రాధామోహన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని అంటున్నారు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఇద్దరూ ఉన్నారట. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.