కేజీఎఫ్ సీక్వెల్‌ కు సన్నాహాలు.. భారత రాష్ట్రపతి పాత్రలో రమ్యకృష్ణ!

వాస్తవం సినిమా: కన్నడ హీరో యాష్ నటించిన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలై భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. గత డిసెంబరు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. భారీ వ‌సూళ్ల‌ను రాబట్టింది. కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించగా, దీన్ని 2400 థియేటర్లలో విడుదల చేశారు. విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లు రాబడుతూ వెళుతోంది. ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతూ ఉండగానే, దీని సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్ర నిర్మాత విజయ్ కిరంగన్ దుర్ అప్పుడే మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశాడు.2వ భాగానికి సంబంధించి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ .. రమ్యకృష్ణల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. భారత రాష్ట్రపతి పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుందనీ .. కొత్తగా క్రియేట్ చేసిన వొక పవర్ ఫుల్ పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తాడని అంటున్నారు.