తార‌ల మ‌ధ్య న‌వ్వులు చిందిస్తూ మోదీ

వాస్తవం సినిమా: భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తార‌ల మ‌ధ్య న‌వ్వులు చిందిస్తూ ఉన్న ఓ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ పిక్‌ని క‌ర‌ణ్ జోహార్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. సినిమా టికెట్లపై జీఎస్టీ తగ్గించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు. అసలు విషమేఅమిటంటే..
రొటీన్ కు కాస్త భిన్నంగా బాలీవుడ్ ప్రముఖుల టీమ్ ప్రధాని నరేంద్ర మోదిని కలిసి భారతదేశ అభివృద్ధిలో ఫిలిం ఇండస్ట్రీ ఎలాంటి పాత్ర పోషించాలి.. తమ వైపు నుండి ఎలాంటి సహకారం అందించాలి అనే విషయాలపై గురువారం చర్చ జరిపిందట. ఈ బాలీవుడ్ టీమ్ కు కరణ్ జోహార్ నేతృత్వం వహించాడట. ఈ టీమ్ లో రణబీర్ కపూర్.. రణవీర్ సింగ్.. సిద్ధార్థ్ మల్హోత్రా.. ఆయుష్మాన్ ఖురానా.. విక్కీ కౌశల్.. రాజ్ కుమార్ రావ్.. అలియా భట్.. ఏక్తా కపూర్.. భూమి పెడ్నేకర్.. రోహిత్ శెట్టి.. అశ్విని అయ్యర్ తివారిలు ఉన్నారు. చర్చలు జరిపిన అనంతరం ప్రధానమంత్రి తో ఒక సెల్ఫీ కూడా తీసుకున్నారు. మధ్యలో ప్రధాని తనదైన స్టైల్ లో చిరునవ్వులు చిందిస్తూ నిలబడ్డారు. బాలీవుడ్ టీమ్ అంతా అయన చుట్టూ నిలబడి ఖుషీఖుషీగా పోజిచ్చారు. సెల్ఫీ తీసింది ఎవరనుకున్నారు? రణవీర్ సింగ్.