త‌న పెళ్లి విష‌యంపై స్పందించిన విశాల్

వాస్తవం సినిమా: సినీ హీరో, నడిగర్ సంఘం సెక్రటరీ, తమిళ చలనచిత్ర నిర్మాత మండ‌లి అధ్య‌క్షుడు విశాల్ త్వ‌ర‌లో వివాహం చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. విశాల్ తండ్రి జీకే ఇటీవ‌ల ఈ విష‌యాన్నివెల్లడించగా, త‌న పెళ్లి విష‌యంపై విశాల్ తాజాగా స్పందించాడు. త‌మ‌ది పెద్దలు కుదిర్చిన వివాహం కాదని.. ప్రేమ వివాహమని విశాల్ తెలిపాడు. విశాల్ చేసుకోబోయే అమ్మాయి పేరు అనీషా కాగా, ఆమె హైదరాబాద్‌ బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజ కుమార్తె. త్వ‌ర‌లో వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్ హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ హోట‌ల్‌లో జ‌ర‌గ‌నుంది. తమిళ నటీనటుల సంఘానికి సొంత భవనం నిర్మించాకే పెళ్లి చేసుకుంటాన‌ని విశాల్ గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే . ప్ర‌స్తుతం బిల్డింగ్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, వ‌చ్చే ఏడాది పూర్తికానున్నట్లు సమాచారం.