అలోక్ వర్మ సంచలన నిర్ణయం

వాస్తవం ప్రతినిధి: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన శుక్రవారం ప్రకటించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో బుధవారం మరోసారి సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ను మళ్లీ తప్పిస్తూ,ఫైర్ సర్వీసెస్ డీజీ గా బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వరుస పరిణామాల తో తీవ్ర మనస్తాపానికి గురైన అలోక్ వర్మ అగ్నిమాపక డీజీ గా భాద్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.