నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

వాస్తవం ప్రతినిధి:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా జువ్వలదిన్నెలోని ఉప్పుటేరు వాగుపై నిర్మించిన కొత్త వంతెనను సీఎం ప్రారంభిస్తారు. బోగోలులో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జిల్లాలో శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహం, స్మారకాన్ని ఆవిష్కరిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి దాదాపు 60,000 మంది లబ్ధిదారులకు సీజీఎస్ఎఫ్ భూముల పట్టాలను పంపిణీ చేస్తారు. అనంతరం దగదర్తి ఎయిర్ పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, టీడీపీ నేతలు ఆయన్ను ఘనంగా స్వాగతించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.