మరోసారి కన్నీటి పర్యంతమైన కర్ణాటక సీఎం

వాస్తవం ప్రతినిధి: సీఎం అన్న విషయం మరిచి చిన్న పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు కర్ణాటక సీఎం కుమారస్వామి. కుమారస్వామిని మిత్రపక్షం కాంగ్రెస్ లెక్క చేయడం లేదన్న బాధతో ఆయన ఏడ్చేశాడట..నెలకిందట ఇలాగే ఏడ్చేసిన కుమారస్వామి.. తాజాగా మరోసారి కన్నీళ్లు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జేడీఎస్ నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్ తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారట..జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చింది.

సీఎం కుమారస్వామితో కాంగ్రెస్ నేతలు బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని.. వేరే దారి లేక కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు చేయాల్సి వచ్చిందని కుమారస్వామి భావోద్వేగానికి గురై జేడీఎస్ ఎమ్మెల్యేల ముందర కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారస్వామి ఏడుపు చూసి కాంగ్రెస్ పై వేచి చూద్దామని.. తీరు మారకపోతే ఆలోచిద్దామని సమావేశానికి హాజరైన జేడీఎస్ అధినేత – మాజీ ప్రధాని దేవెగౌడ సూచించినట్టు సమాచారం.