తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు?: పాల్

వాస్తవం ప్రతినిధి: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఈ రోజు భీమవరంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పాల్ మాట్లాడుతూ వైఎస్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని వ్యక్తి అంటూ పార్టీలోని తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడంటూ విరుచుకుపడ్డారు. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఎలాంటి స్పెషల్‌ ప్యాకేజీలు అవసరం లేకుండానే రాష్ట్రాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని పాల్ ధీమా వ్యక్తం చేశారు. తన పార్టీ గెలిచిన నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో కార్పొరేట్‌ వైద్యం, విద్యా, ఉద్యోగ సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అంటే తనకెంతో ఇష్టమన్నారు. రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్నఆయన రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు.