చంద్రబాబు కి భారీ షాక్..జనసేనలోకి…“ఆ మంత్రి”

వాస్తవం ప్రతినిధి:  మరో ఐదు నెలలలో అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో అలజడి రేపనున్నాయి. వైసీపీ ,టీడీపీ  , జనసేన పార్టీలు ప్రజల మద్దతు దక్కించుకోవడానికి నువ్వా ,నేనా అనేట్టుగా పోటీల మీద పోటీలు పడుతున్నాయి. కాని ప్రస్తుతానికి ఏపీలో టీడీపీ ప్రభావం అంతగా ఉండబోదని ,తెలంగాణా ఎన్నికలలో ఓటమితో బాబు చాప్టర్ క్లోజ్ అయ్యిందని టీడీపీ నేతలు ఎప్పుడో ఫిక్స్ అయ్యారట. బాబు సీఎం అవ్వరని డిసైడ్ అయిన సదరు నేతలు ఇప్పుడు ఎంచక్కా గ్లాసు కి జై కొట్టనున్నారని టాక్ వినిపించింది.

అయితే ఎవరూ ఊహించని రీతిలో తాజాగా టీడీపీ రాష్ట్ర మంత్రే ఏకంగా జనసేన లోకి వెళ్లాలని అనుకుంటున్నారని , త్వరలో గ్లాసు తీర్ధం పుచ్చుకోనున్నారని టాక్ వినిపిస్తోందట. అంతేకాదు ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ ఈ షాకులు ఏంటి..?? ఇంతకీ జనసేనలోకి జంప్ చేయబోయే ఆ మంత్రి ఎవరు..?? పవన్ కళ్యాణ్ సదరు మంత్రి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..?? ఆ మంత్రిగారి స్టామినా సొంత జిల్లాలో ఎంతవరకూ ఉంది అనే వివరాలలోకి వెళ్తే.

కర్నూలు జిల్లాలో పేరుకుపోయిన అసమ్మతి సెగలు ఇప్పుడు టీడీపీకి భారీ షాక్ ఇవ్వబోతున్నాయి. సీనియర్ల తీరుతో తీవ్ర అసంతృప్తి తో రగిలిపోతున్న భూమా అఖిల ప్రియ ,మంత్రిగా ఉన్నా సరే ఆమె మాటకి పార్టీలో కాని , అధికారులలో కాని విలువలేకుండా పోతోందట. తన తండ్రి అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి తో ఉన్న విభేదాలని బాబు ఇప్పటికి కూడా పరిష్కరించలేక పోయారు. దాంతో ఆమెలో పెరిగిన అసహనం పార్టీ అధ్యక్షుడు జిల్లాలో పర్యటన చేస్తున్నా సరే ఆమె వెళ్లి కలవను కూడా కలవలేదట.

దాంతో రేపో మాపో అఖిల ప్రియ సైకిల్ దిగడం ఖాయం అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆమె అసహనానికి కారణం లేకపోలేదు. ఒక మంత్రిగా అఖిల ప్రియ స్థానికంగా పట్టుకోరుకోవాలని అనుకోవడం సహజమే అయితే ఇదే సమయంలో సుబ్బారెడ్డి ని నిలువరించమని బాబు కి ఎంతగా చెప్పినా పట్టించుకోలేదట. అంతేకాదు ఇదే స‌మ‌యంలో అఖిల‌ప్రియ అనుచ‌రులు ఇళ్ల‌ల్లో  స‌మాచారం లేకుండా కార్డ‌న్ సెర్చ్ నిర్వ‌హించ‌డంతో ఆమె మ‌రింత మ‌న‌స్తాపానికి గుర‌య్యారు..దాంతో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

తాజాగా నియోజకవర్గంలో పర్యటనలు చేసిన ఆమె “ప్ర‌జ‌లే నాకు శ్రీరామ ర‌క్ష”  అంటూ కామెంట్ చేయ‌డం ఇందులో భాగ‌మేన‌ని అంటున్నారు. బాబు క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టించినా ఆమె వెళ్లక పోవడానికి గల ప్రధాన కారణం బాబు పై ఉన్న తీవ్ర అసంతృప్తేనట. అయితే ఆమె ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళడానికి కూడా సుముఖంగా లేరట. తన తండ్రి బ్రతికున్నప్పటి నుంచీ పవన్ కళ్యాణ్ సుపరిచితులని గతంలోనే అఖిల ప్రియ నంద్యాల ఉపఎన్నికల్లో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వైసీపీ ,బీజేపీ , టీడీపీ లోకి వెళ్ళడానికి ఇష్టపడని అఖిల. తాజాగా జనసేన వైపు ఆశగా చూస్తున్నట్టుగా తెలుస్తోంది.  మరి జనసేనాని అఖిల ప్రియ ఎంట్రీ కి ఊ కొడతాడో ఊహూ కొడతాడో వేచి చూడాల్సిందే.