సిద్దూ కారుకు తప్పిన పెను ప్రమాదం

వాస్తవం ప్రతినిధి: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కారుకు పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి మైసూరుకు జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఆయన వాహనాల బారును వెనుక నుంచి వచ్చిన ఓ కారు గుద్దేయడం తో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆయన కాన్వాయ్‌లోని ఐదు సుమోలు ఒకదానితో మరొకటి ఢీకొనడం తో ఐదు సుమోలకు తీవ్రనష్టం వాటిల్లింది. ప్రమాదంలో సిద్ధరామయ్యతో సహా అందరూ పాణాపాయం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తుంది. కానీ కాన్వాయ్‌లో సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న ఓ సబ్-ఇన్‌స్పెక్టర్ మారిగౌడ ఈ ఘటన కారణంగా తీవ్ర మనస్థాపానికి గురవ్వడం తో గుండెపోటు రావడం వల్ల ఆయన మరణించినట్లు సమాచారం.