వాకాడు తీరానికి 2 టన్నుల సొరచేప కళేబరం

వాస్తవం ప్రతినిధి: నెల్లూరు జిల్లా వాకాడు మండ‌లం పూడిరాయి దొరువు స‌మీపంలోగ‌ల స‌ముద్ర‌తీరానికి ఓ భారీ తిమింగ‌ల అవ‌శేషం కొట్టుకొచ్చింది. పూడిరాయి దొరువు గ్రామంలోని స‌త్రంబాట ప్రాంతంలో ఉద‌యం చేప‌ల వేట‌కు వెళ్ళిన మ‌త్స్య‌కారులు.. తిమింగ‌ల అవ‌శేషాన్ని గ‌ర్తించి.. రెవెన్యూ, మ‌త్స్య‌శాఖ ఆధికారుల‌కు స‌మాచారం అందించారు. స‌ముద్రంలో తిరిగే భారీ ఓడ‌లకు త‌గిలి తిమింగలం మృతిచెందిన‌ట్లు అధికారులు తెలియ‌జేశారు. సుమారు 2 ట‌న్నుల బ‌రువుగ‌ల ఈ తిమింగ‌ల అవ‌శేషాన్ని ఖ‌ననం చేసే క్ర‌మంలో గ్రామంలో ఎలాంటి దుర్వాస‌న‌ రాకుండా మ‌త్య్స‌కారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే..ఓ భారీ చేప స‌మ‌ుద్ర‌తీరానికి కొట్టుకొచ్చింద‌ని తెలుసుకున్న గ్రామస్తులు తిమింగలాన్ని తిల‌కించేందుకు ప‌రుగులు తీశారు.