మే కు మరో అపజయం!

వాస్తవం ప్రతినిధి: బ్రిటన్‌ ప్రధాని థెరెసా మేకి బుధవారం మరో ప్రధాన పార్లమెంటరీ అపజయం ఎదురైంది. ఒప్పందమేదీ లేకుండా బ్రెగ్జిట్‌ అయ్యేందుకు ఒప్పుకోడానికి నిరాకరిస్తూ, మేకి వ్యతిరేకంగా మంగళవారమే కొందరు ఎంపీలు ఓటు వేసిన సంగతి తెలిసిందే. అయితే అది జరిగి ఇంకా 24 గంటలు గడవక ముందే పార్లమెంటులో ఆమెకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒకవేళ ప్రస్తుతం మే కుదుర్చుకున్న బ్రెగ్జిట్‌ ఒప్పందాన్ని పార్లమెంటు ఆమోదించకపోతే, ఆ తర్వాత మూడు రోజుల్లోపే మరో ప్రత్యామ్నాయ ఒప్పందాన్ని ఆమె తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన సవరణను 20 మంది ఎంపీలు బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టగా, 308 మంది అనుకూలంగా, 297 మంది వ్యతిరేకంగా ఓటేసినట్లు తెలుస్తుంది. దీనితో మే కు ఇది పెద్ద సవాల్ గా మారే అవకాశం ఉంది.