బీరు పోయిస్తా కొండ కొమ్ము మీద నుంచి ట్రంప్ ను తోసేస్తావా”…..ట్రూడో కు ఎదురైన ప్రశ్న

వాస్తవం ప్రతినిధి: బీరు పోయిస్తా ట్రంప్ ను కొండ కొమ్ము మీద నుంచి తోసేస్తావా? ఈ చిత్రమైన ప్రశ్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఎదురైంది. నిజంగా ఇది నిజం. బ్రిటిష్ కొలంబియాలో టౌన్‌హాల్ మీడింగ్‌లో కెనడా ప్రధాని ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నప్పుడు ఈ ఇబ్బందికరమైన అనుభవం ఎదురైంది. ఓ వృద్ధుడు లేచి బీరు పోయిస్తానంటే ట్రంప్‌ను కొండకొమ్ము మీద నుంచి తోసేస్తావా? అని అడిగేసరికి సమావేశంలో ఉన్నవారంతా అవాక్కయ్యారు. కానీ ట్రూడో ఏమాత్రం తొణకకుండా స్పందించారు. పొరుగుదేశం గురించి అలాంటి హింసాత్మక జోకులు వేయడం భావ్యం కాదని సున్నితంగా చెప్పారు. కెనడాకు ఎవరు ప్రధాని? అమెరికాకు ఎవరు అధ్యక్షుడు? అనేదానితో ప్రమేయం లేకుండా రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య లోతైన సంబంధాలున్నాయని ఆయన ఈ సందర్భంగా నొక్కిచెప్పారు.