ఇజ్రాయిల్ మాజీ మంత్రికి 11 ఏళ్ల జైలు శిక్ష

వాస్తవం ప్రతినిధి: ఇజ్రాయిల్ మాజీ మంత్రి గోనెన్ సెగెన్ కు 11 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు తెలుస్తుంది. గూఢచర్యం కేసులో ఇజ్రాయిల్‌ మాజీ మంత్రి గోనెన్‌ సెగేవ్‌ దోషిగా తేలడం తో . ఈకేసులో న్యాయస్థానం ఆయనకు 11 ఏండ్ల జైలుశిక్ష ఖరారు చేసిందని ఇజ్రాయిల్‌ న్యాయశాఖ బుధవారం ప్రకటించింది. ఇజ్రాయిల్‌ రక్షణ శాఖకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇరాన్‌కు చేరవేసినట్టు విచారణలో సెగేవ్‌ అంగీకరించారని తెలిపింది. 1990లో సెగేవ్‌ ఇజ్రాయిల్‌ విద్యుత్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఇజ్రాయిల్‌ రక్షణ శాఖకు సంబంధించిన కీలక దస్త్రాలను, సమాచారాన్ని ఇరాన్‌కు చేరవేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన కదలికలపై అనుమానం వచ్చిన ఇజ్రాయిల్‌ ఆర్మీ సెగేవ్‌ను గినియాలో అదుపులోకి తీసుకుంది. మంత్రి పదవి చేపట్టక ముందు ఆయన నైజీరియాలో కొంతకాలం వైద్యుడిగా పనిచేశారు. 2005లో మాదకద్రవ్యాల కేసులో అరెస్టయి ఐదేండ్ల కారాగారం అనుభవించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయన కోడింగ్‌ విధానం ద్వారా ఇజ్రాయిల్‌ సైనిక శిబిరాలకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఇరాన్‌కు చేరవేసినట్టు ఆధారాలతో సహా అధికారులు కోర్టులో ప్రవేశపెట్టడం తో అతనికి 11 ఏళ్ల జైలు శిక్ష ఖరారు అయ్యింది.