ఇండియన్ కంటెంట్ ను పాక్ చానళ్ల లో ప్రసారం చేయదు!

వాస్తవం ప్రతినిధి: పాకిస్థానీ టీవీ ఛానెళ్లలో భారత్‌కు చెందిన అంశాలను (ఇండియన్‌ కంటెంట్‌) ప్రసారం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించదని పాక్‌ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ సాకిబ్‌ నిసార్‌ పేర్కొన్నారు. ఇది పాక్‌ సంస్కృతిని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ ఛానెళ్లలో భారత్‌ కంటెంట్‌ ప్రసారాలపై హైకోర్టు నిషేధం విధించడాన్ని సవాల్‌ చేస్తూ పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా నియంత్రణ సంస్థ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా పాక్‌ ప్రధాన న్యాయమూర్తి బుధవారం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి కోర్టు వాయిదా వేసినట్లు తెలుస్తుంది.