సోషల్ మీడియా ద్వారా సంచలన ప్రకటన చేసిన అమెజాన్ దిగ్గజం

వాస్తవం ప్రతినిధి: ప్రముఖ ఆన్లైన్ వ్యాపారం దిగ్గజం అమెజాన్ పౌండర్, సీఈవో, జెఫ్ బెజోస్‌(54) సోషల్‌ మీడియా ద్వారా సంచలన ప్రకనట చేశారు. భార్య మెక్కెంజేతో ఆయన విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. మా జీవితాల్లో చోటుచేసుకున్న ఒక ముఖ్యమైన ఘట్టాన్ని హితులు, సన్నిహితుల దృష్టికి తీసుకొస్తున్నామంటూ ట్వీట్‌ చేశారు. పాతికేళ్లపాటు భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, అయితే విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని సంయుక్త ప్రకనటలో తెలిపారు. మెకెంజీ (48) మంచి రచయిత్రి. 1993 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ నలుగురు పిల్లలు.