అగ్రస్థానంలో కొనసాగుతున్న కోహ్లీ,బుమ్రా

వాస్తవం ప్రతినిధి: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తమ తమ విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. జట్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో భారత్‌ వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిస్తే 125 పాయింట్లతో ఇంగ్లాండ్‌కు చేరువలో నిలుస్తుంది.. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ ఖాతాలో 126 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఆసీస్‌పై 2-1తో టెస్టు సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా ఆ జట్టుతో మూడు వన్డేలు, న్యూజిలాండ్‌లో ఐదు వన్డేలు ఆడనుంది. వరుసగా అన్ని మ్యాచ్‌లు గెలిస్తే 125 పాయింట్లు లభిస్తాయి. బ్యాటింగ్‌ జాబితాలో కోహ్లీ, రోహిత్‌ శర్మ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా అగ్రస్థానంలో ఉండగా కుల్‌దీప్‌ యాదవ్‌ మూడో ర్యాంకులో నిలిచాడు.