ఆసీస్ పర్యటన షెడ్యుల్ ని విడుదల చేసిన బీసీసీఐ

వాస్తవం ప్రతినిధి: ఇండియాలో ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. ఈ టూర్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండు టీ20లు, ఐదు వన్డేల జరగనున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకు భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటిస్తుంది. ఫిబ్రవరి 24న బెంగళూరులో తొలి టీ20, 27న విశాఖపట్నంలో రెండో టీ20 మ్యాచ్ జరగనున్నాయి. ఇక మార్చి 2వ తేదీన జరిగే తొలి వన్డే మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. రెండో వన్డే మార్చి 5న నాగ్‌పూర్‌లో, 8న మూడో వన్డే రాంచీలో, 10న నాలుగో వన్డే మొహాలీలో, 13న ఐదో వన్డే ఢిల్లీలో జరగనున్నాయి. టీ20 మ్యాచ్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు, వన్డే మ్యాచ్‌లు మధ్నాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి.