ఓవర్సీస్ లోను అదే దూకుడు

వాస్తవం సినిమా: ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగంగా నిన్ననే ‘కథానాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోని థియేటర్స్ దగ్గర భారీస్థాయిలో సందడి కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజున 7.61కోట్ల షేర్ ను వసూలు చేసింది. పండుగ సెలవులు మొదలు కానుండటంతో, ఈ సినిమా వసూళ్లు భారీస్థాయిలో పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది పూర్తిగా విభిన్నమైన కంటెంట్ కావడం వలన, కొత్తగా వచ్చే సినిమాల పోటీ ప్రభావం పెద్దగా ఉండదని చెప్పుకుంటున్నారు. జానపద .. పౌరాణిక .. సాంఘిక చిత్రాలలో ఎన్టీఆర్ గెటప్స్ లో బాలకృష్ణ కనిపిస్తుండం ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అంటున్నారు. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా ఇదే స్థాయిలో దూకుడు చూపుతుండటం విశేషం. 2వ భాగమైన ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న’ విడుదల కానుంది.