ఆ వార్తలో ఎంతమాత్రం నిజం లేదు : వెంకటేశ్

వాస్తవం సినిమా:వెంకటేశ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఎఫ్ 2’ రెడీ అవుతోంది. సంక్రాంతి కానుకగా ఎల్లుండి ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాలను గురించి వెంకటేశ్ మాట్లాడారు.

“చైతూతో నేను చేయనున్న ‘వెంకీ మామ’ సినిమా కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. కామెడీని కలుపుకుని ఎమోషనల్ గా ఈ కథ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్ ఇది. నేను .. చైతూ ఇద్దరం కూడా సినిమా అంతా కనిపిస్తూనే ఉంటాము. నేను చేయబోయే నెక్స్ట్ సినిమా అదే. ఇక త్రివిక్రమ్ తో నేను చేయనున్న సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. త్రివిక్రమ్ తో నా సినిమా తప్పకుండా ఉంటుంది. ఇంతవరకూ కథ సెట్ కాకపోవడమే ఆలస్యానికి కారణం. త్వరలోనే త్రివిక్రమ్ మంచి కథతో వస్తాడనే నమ్మకం వుంది” అని చెప్పుకొచ్చారు