ముచ్చటగా మూడోసారి

వాస్తవం సినిమా: రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన కాంచన సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. తాజాగా ఈ సిరీస్‌లో కాంచన-3 రానున్నది. రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బి. మధు సమర్పకుడు. ఓవియా, వేదిక కథానాయికలు. చిత్రీకరణ పూర్తయింది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర బృందం మోషన్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఈ పోస్టర్‌లో పంచెకట్టుతో మెడలో రుద్రాక్షలు ధరించి వైట్ హెయిర్‌ైస్టెల్‌తో రాఘవ లారెన్స్ వినూత్న లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రెల్ ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  కోవై సరళ, కబీర్ దుహాన్ సింగ్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, వెట్రి.