‘కథానాయకుడు’ పై ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు

వాస్తవం సినిమా: దివంగత ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగమైన ‘కథానాయకుడు’ బుధవారం విడుదలైంది. తొలి షోతోనే హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనీ,మహాపురుషులవుతారనీ నిరూపించిన కారణజన్ముడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆ మహానుభావుడి పాత్రను అత్యద్భుతంగా పోషించిన బాలయ్యకు హ్యాట్సాఫ్. డైరెక్టర్ క్రిష్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, విద్యాబాలన్ మొదలైన టీమ్ సభ్యులందరికీ పేరుపేరునా నా అభినందనలు’ అని తెలిపారు.