ఆర్మీ లో గే లకు స్థానం లేదు: రావత్

వాస్తవం ప్రతినిధి: భార‌త సైనిక ద‌ళంలోకి స్వలింగ సంపర్కులను తీసుకోలేమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. భారత సైనిక దళం సాంప్ర‌దాయ‌క‌మైంద‌ని, అందులోకి స్వ‌లింగ సంప‌ర్కుల‌ను తీసుకోలేమ‌ని రావ‌త్ తెలిపారు. గ‌త ఏడాది సుప్రీంకోర్టు గే సెక్స్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిన నేపధ్యంలో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన‌ప్పుడు ఆయ‌న పై విధంగా స్పందించారు. ఇక్క‌డ అలాంటివి న‌డ‌వ‌వు,మ‌నం ఆధునీక‌ర‌ణ చెంద‌లేద‌ని, పాశ్చాత్యంగా కూడా మార‌లేద‌ని, ఎల్జీబీటీ స‌మ‌స్య‌ల‌ను ఇక్క‌డ మ‌నం ఆమోదించ‌లేమ‌ని బిపిన్ రావ‌త్ స్ప‌ష్టం చేశారు. ఆర్మీ యాక్టు ప్ర‌కారం ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ఒక‌వేళ మ‌న‌కు ఆఫ్ఘ‌నిస్తాన్‌పై ఆస‌క్తి ఉంటే, అప్పుడు తాలిబ‌న్ అంశాన్ని కూడా ప‌రిశీలించాల్సి ఉంటుంద‌న్నారు.