రాహుల్ మహిళలకు వ్యతిరేకం కాదు: ప్రకాశ్ రాజ్

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్ సీడబ్ల్యూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ మీద చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ రాహుల్ గాంధీ ముఖ్య స్థానంలో ట్రాన్స్ జెండర్ ను నియమించారని, అంతమాత్రాన ఆయన మహిళలకు వ్యతిరేకం కాదని ప్రకాశ్ రాజ్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఒకే కోణంలో చూడకుండా..వేరే కోణంలో చూడలేరా..?, పార్లమెంట్ లో చర్చ జరిగిన సమయంలో రాఫెల్ డీల్ అంశంపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వలేదనేది నిజం కాదా..? అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. మీరు ఈ విషయాన్ని కూడా గమినించాలని ప్రకాశ్ రాజ్ సూచించారు. ప్రకాశ్ రాజ్ ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ గాంధీని కలిసిన అనంతరం పైవిధంగా స్పందించినట్లు తెలుస్తుంది.