వీరితో మాట్లాడడం వెస్ట్…అంటూ వాకౌట్ చేసిన ట్రంప్!

వాస్తవం ప్రతినిధి: అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి సంబంధించిన అంశంలో బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ప్రముఖ నేతలతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం తో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో డెమొక్రాట్ లతో మాట్లాడడం టైం వెస్ట్ అని అంటూ ట్రంప్ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలుస్తుంది. ‘ఇది పూర్తిగా టైం వేస్ట్‌’ అని తర్వాత ట్వీట్‌ చేశారు. నేను వాళ్లకు బైబై చెప్పి వచ్చేశాను. ఆ సమావేశం ఏమాత్రం ఉపయోగకరంగా లేదు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.మరోవైపు డెమోక్రాట్‌ నేత చక్‌ షమెర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ట్రంప్‌ టేబుల్‌పై గట్టిగా చరిచి పైకి లేచి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. మరోసారి ఆయన కోపాన్ని ప్రదర్శించారు. ఎందుకంటే ఆయన అనుకున్నట్లు జరగట్లేదు కాబట్టి’’ అని అన్నారు. షట్‌డౌన్‌ ముగియాలంటే గోడ నిర్మాణానికి నిధులు కేటాయించాల్సిందేనని ట్రంప్‌ సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది. అయితే డెమోక్రటిక్‌ నేత, ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ అందుకు అంగీకరించలేదని సమాచారం.