మోదీ సర్కార్ పై విమర్శలు చేసిన మమతా

వాస్తవం ప్రతినిధి: జనరల్ కేటగిరివారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలు వస్తాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ బుకాయిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. నదియా జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ జనరల్ కేటగిరి వారికి ఎక్కువ అవకాశాలు లేవని,ఉన్న కొద్దీ అవకాశాలను కూడా పది శాతం రిజర్వేషన్లతో సీల్ చేశారని అన్నారు. ప్రభుత్వంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లేవని, బీదవారికి పది శాతం ఉద్యోగాలు కూడా రావని అన్నారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలను ఉద్యోగాలకు దూరం చేశారంటూ ఆమె విమర్శించారు. ఈబీసీ బిల్లు అమలుపై అనేక సందేహాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.