తెలుగులో మరో చిత్రానికి పచ్చ జెండా ఊపిన కీర్తి

వాస్తవం సినిమా: ‘మహానటి’ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ అధ్బుతంగా నటించి అందరి ప్రసంశలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం హిట్ అయిన తరువాత కీర్తి సురేష్‌ ఆ తర్వాత చిత్రాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గతేడాది విడుదలైన ‘మహానటి’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కీర్తిసురేష్‌ నటించిన ‘సర్కార్‌’, ‘పందెంకోడి2’ చిత్రాలు కూడా కమర్షియల్‌ హిట్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో తెలుగులో మరో సినిమా చేసేందుకు ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. అయితే ఈ సారి కూడా మహిళా ప్రాధ్యాన్యం ఉన్న సినిమా నే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈస్ట్‌ కోస్ట్‌ బ్యానర్‌లో మహేష్‌ కోనేరు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతోంది. నాగేంద్ర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్‌ అన్నపూర్ణా స్టూడియోలో జరుగగా, ముహూర్త సన్నివేశానికి కథానాయకుడు కల్యాణ్‌రామ్‌ క్లాప్‌ కొట్టి సినిమా ను ప్రారంభించారు.