పాక్ గూఢ చారిని అరెస్ట్ చేసిన అధికారులు

వాస్తవం ప్రతినిధి: పాక్ గూఢ చారిని అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ గూఢచారిగా పని చేస్తున్న నిర్మల్ రాయ్ అనే వ్యక్తిని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు అధికారులు. అసోంలోని తిన్సుఖియాలో నివసిస్తున్న నిర్మల్ రాయ్ రెండు గ్రామాల్లో సైన్యానికి పోర్ట‌రుగా పనిచేస్తున్నాడు. గత కొంతకాలం నిర్మల్ రాయ్ పై మిలిటరీ ఇంటలిజెన్స్ అధికారులు నిఘా పెట్టగా,నిర్మల్ రాయ్ పాకిస్తాన్ కు గూఢచారిగా పనిచేస్తున్నట్లు నిర్థారించారు. దీంతో ఇతన్ని అరెస్టు చేసి పోలీసులకు అప్పగించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. నిర్మల్ రాయ్ ఫోనులో కొన్ని రహస్య పత్రాలను, ఫొటోలను కనుగొన్నారు. నిర్మల్ రాయ్ కి దుబాయిలో ఉంటున్న ఇండోనేషియా మహిళతో, ఎమిరేట్స్ లో ఉంటున్న ఓ పాకిస్తాన్ వ్యక్తితో సంబంధాలు ఉన్నట్టు అధికారులు నిర్థారించారు.