వైపీజీ కి మద్దతిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలిసి ఉంటుంది: ఏర్దోగన్

వాస్తవం ప్రతినిధి: సిరియాలోని కుర్దు తిరుగుబాటుదారులకు (వైపీజీ) ట్రంప్‌ సర్కార్‌ మద్దతిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ హెచ్చరించారు. పార్లమెంట్‌లో అధికార ఏకే పార్టీ సభ్యులతో ఆయన మాట్లాడుతూ పై హెచ్చరిక జారీ చేశారు. అమెరికా బలగాలు సిరియా నుంచి వైదొలగాలని మేం కోరుతున్నాం. యూఎస్‌ బలగాల ఉపసంహరణకు సంబంధించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ పలు షరతులు పెట్టారు. ట్రంప్‌ సర్కార్‌ వైపీజీకి మద్దతు ఇవ్వడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. టర్కీలో నిషేధిత ఉగ్రసంస్థల జాబితాలో వైపీజీ కూడా ఒకటి. అలాంటి సంస్థకు అమెరికా మద్దతి స్తోంది. అంకారా బలగాలకు, వైపీజీకి మధ్య పోరు కొనసాగుతూనే ఉంటుంది అని అమెరికా తక్షణమే వైపీజీకి మద్దతు ఇవ్వడాన్ని ఉపసంహరించుకోవాలి’ అని అన్నారు.