చైనా లో భారత రాయబారిగా విక్రమ్ మిస్రీ

వాస్తవం ప్రతినిధి: చైనాలో భారత రాయబారిగా విక్రమ్‌ మిస్రీ ని నియమించినట్లు తెలుస్తుంది. ఆయన మంగళవారం భాద్యతలు స్వీకరించారు. ఆయన 1989వ బ్యాచ్‌ ‘ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసు(ఐఎఫ్‌ఎస్‌)’ అధికారి. గతంలో ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాల్లోని దౌత్య కార్యాలయాల్లో పని చేసిన ఆయన ఇప్పుడు చైనా రాయబారిగా భాద్యతలు స్వీకరించారు. చైనాలో రాయబారిగా పనిచేసిన గౌతం బంబావాలె గత ఏడాది నవంబరులో పదవీ విరమణ పొందిన నేపధ్యంలో ఆయన స్థానంలో విక్రమ్ మిస్రీ ని నియమించినట్లు తెలుస్తుంది.