ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాజీ కోచ్!

వాస్తవం ప్రతినిధి: భారత మాజీ క్రికెటర్, బరోడా జట్టు మాజీ కోచ్ జాకోబ్ మార్టిన్ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ను ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది,కారణాలు ఏంటి అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. ఐతే ఈ విషయాన్ని భారత సీనియర్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆయన తొందరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు పఠాన్ వ్యాఖ్యానించారు. 
1999-2001 మధ్య టీమిండియా తరఫున జాకోబ్ 10 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. 138 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఎక్కువ కాలం బరోడాకు ఆడిన మార్టిన్ కొన్ని మ్యాచ్‌ల్లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 2016-17 సీజన్‌కు బరోడా టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించారు.