భారత్ పై ప్రసంశల వర్షం కురిపిస్తున్న పాక్ మాజీ ఆటగాళ్లు

వాస్తవం ప్రతినిధి:  ఆస్ట్రేలియాను ఓడించిన భారత క్రికెట్‌ జట్టు 2-1 తో  సిరీస్ ను గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత క్రికెట్ జట్టుపై పలువురు ప్రసంశలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు కూడా భారత జట్టుపై ప్రసంశల వర్షం కురిపించారు. నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఆసీస్‌లో సిరీస్‌ గెలిచిన తొలి ఆసియా జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ జట్టును ఒకప్పటి బౌలింగ్‌ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ అభినందించాడు. ‘ఈ అత్యద్భుత ప్రదర్శనకు గాను విరాట్‌ కోహ్లీ ప్రశంసలకు అర్హుడు. భారత్‌లోని పటిష్ఠ దేశవాళీ విధానం వల్లే ఈ విజయం సాధ్యమైందని అనుకుంటున్నా’ అని వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు.పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సైతం టీమిండియాను అభినందించిన సంగతి తెలిసిందే. ‘ఆస్ట్రేలియాలో సిరీస్‌ కైవసం చేసుకున్న తొలి ఆసియా జట్టుగా అవతరించిన భారత క్రికెట్‌ జట్టు, కోహ్లీకి అభినందనలు’ అని ఆయన అన్నారు.