ఐపీఎల్ భారత్ లోనే జరగనుంది

వాస్తవం ప్రతినిధి: ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ 2019 ఎడిషన్ భారత్‌లోనే జరగనుంది. సుప్రీం కోర్టు నియమిత క్రికెట్‌ పాలకుల కమిటీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఎప్పటిలా ఏప్రిల్‌ మొదటి వారంలో కాకుండా మార్చి 23న ఐపీఎల్‌ ప్రారంభమవుతుందని కమిటీ వెల్లడించింది. త్వరలోనే వేదికలను ప్రకటిస్తారు. లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో భద్రత కల్పించడం కష్టమవుతుందని పొట్టి క్రికెట్‌ లీగ్‌ను విదేశాలకు తరలిస్తారని ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లు తరలించాల్సిన అవసరం వస్తే బ్యాకప్‌ వేదికలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థలను సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల ప్రక్రియ తేదీలు ప్రకటించిన తర్వాత సభలు, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యాకప్‌ వేదికలు ఎంచుకున్నాం’ అని వినోద్‌ రాయ్‌, డయానా ఎడుల్జీ నేతృత్వంలోని పాలకుల కమిటీ వెల్లడించింది.