వారికే టిక్కెట్లు”..ఆ తరువాతే ప్రకటన.!!!

 వాస్తవం ప్రతినిధి:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఎంతో అనుభవం ఉన్న పార్టీ కూడా ఈ విధమైన వైఖరిని ఇప్పటి వరకూ ప్రదర్శించలేదు అనేట్టుగా ఉంటున్నాయి జనసేనాని తీసుకునే నిర్ణయాలు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సమయం మొదలు ఇప్పటి వరకూ పార్టీలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు పవన్ కళ్యాణ్. పార్టీకి ఒక క్లీన్ ఇమేజ్ తీసుకురావడంలో పవన్ అనుసరించిన మార్గాలు కాని వ్యూహాలు కాని పార్టీ అనతికాల ఎదుగుదలకి ఎంతో ఉపయోగ పడ్డాయి. అయితే ఇప్పుడు అన్ని పార్టీలకి చివరి అంకం దగ్గర పడింది.

ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో పార్టీలు అభ్యర్ధుల ప్రకటన విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత పాదయాత్ర సమయంలో అభ్యర్ధులని ప్రకటించాడు. టీడీపీ పార్టీ ఈ నెలాఖరులోగా తమ అభ్యర్ధులని ప్రకటిస్తామని తెలిపింది. వైసీపీ సైతం ఈ నెలలోనే అభ్యర్ధుల ఎంపిక డిసైడ్ చేయనుంది. ఇక పొతే జనసేన పార్టీ ఈ వ్యవహారంలో మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది.

ఇదిలాఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గురించి కొంతమేర క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు వారికి ఎలాంటి అర్హతలు ఉండాలో కూడా డిసైడ్ చేశారు. నిన్నటి రోజున కర్నూల్ జిల్లాలో జరిగిన సమీక్షా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో దాదాపు 60 శాతం టిక్కెట్లు కొత్తవారికి ఇవ్వబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే 2శాతం భావజాలం ఉన్న వారికి మరో 20 శాతం రాజకీయ విలువలతో కూడి ఉన్న వారికి టిక్కెట్లు ఇవ్వనున్నట్లుగా తెలిపారు.

పార్టీలో అందరూ కొత్త వాళ్ళు ఉంటే పార్టీ అధికారంలోకి రావడం కష్టమని,కొన్ని వ్యుహాలని అమలు చేయాలన్నా పార్టీ మరింత పటిష్టంగా ఉండాలన్నా సరే   అనుభవజ్ఞులైన వారికి టిక్కెట్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. అయితే పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి కొద్ది రోజుల్లు తాత్కాలిక కమిటీలు వేసున్నట్టుగా తెలిపారు. అయితే తమ  పార్టీ అభ్యర్ధుల వివరాలని ఎప్పుడు వెల్లడించేది తేల్చలేదు జనసేనాని.