నాగపూర్ లో భారీ అగ్నిప్రమాదం

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్రలోని నాగపూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఓ ఆస్పత్రిలో ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడం తో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకోవడమే కాకుండా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనితో ఘటనాస్థలికి చేరుకున్న 10 ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.