ఐరోపా కూటమి ఆర్ధిక వ్యవహారాల బుడగ త్వరలోనే పేలుతుంది: మిచ్ ఫ్రీస్టీన్

వాస్తవం ప్రతినిధి: ఐరోపా కూటమి ఆర్థిక వ్యవహారాల బుడగ త్వరలోనే పేలనున్నదని ప్రముఖ విశ్లేషకులు మిచ్‌ ఫీర్‌స్టీన్‌ హెచ్చరించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రీస్‌ సరసన మరో దేశం చేరనున్నదని ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో  ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఐరోపాకు గడ్డుకాలమే. బ్రెగ్జిట్‌, ఇతర సభ్యదేశాలు బెదిరింపులు ఈ కూటమిని బలహీనపరుస్తున్నాయని ఆయన తెలిపారు.. ఫ్రాన్స్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న నిరసనలు దీనికొక సంకేతం. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అశాంతి తలెత్తనున్నదని, దీనికి ఇటలీ నాంది కావచ్చు. పొదుపు చర్యల పేరుతో ప్రజలపై ఎనలేని భారాలు మోపుతున్నారు. గ్రీస్‌ బాటలోనే ఇటలీ, ఫ్రాన్స్‌ నడుస్తున్నాయని ఆయన వివరించారు. ఇటలీ రుణభారం నాలుగు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందన్నారు.. ఫ్రాన్స్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు.